దీపావళి తర్వాతే స్కిల్ కేసుపై తీర్పు
న్యూఢిల్లీ : ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ఫైబర్నెట్ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో దీపావళి పండుగ తర్వాత తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై గురువారం సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కోర్ట్ నంబర్ 6లో ఐటమ్ నంబర్ 11గా చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణ జరిగింది. నవంబర్ 30న ఈ కేసును విచారిస్తామని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇదే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. పాత అర్డర్ ప్రకారం దీపావళి సెలవుల తర్వాత తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో అక్టోబర్ 9న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఫైబర్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు.