కర్నూలు : రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివారులో జగన్నాధ గట్టుపై ఐఐఐటీడీఎమ్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఐఐఐటీడీఎమ్లో రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వం ఐఐఐటీడీఎమ్ నిర్మాణం, వసతి కల్పనకు సహకరించడం లేదని విమర్శించారు. ఇంత వరకూ కాంపౌండ్ వాల్, విద్యుత్ సౌకర్యం, అప్రోచ్ రోడ్డు, నీటి సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోవడం విచారకరమని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/purandheshwari%201.jpg]