అమరావతి : జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, ఎంతో ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టానికి దిక్కూమొక్కూ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మహిళల భద్రతకు అంటూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ యాప్’ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. మహిళలు తమ మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సిన దిశ యాప్ను పురుషుల మొబైల్లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణమని విమర్శించారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/nara%20lokesh.jpg]