ఫెడరేషన్ నిరంతరం పడ్డ శ్రమ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ క్యాబినెట్లో తీర్మానం చేసిందని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఫెడరేషన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేశారు ఫెడరేషన్ ఆవిర్భావం నుండి సంస్థ బలోపేతానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు వస్త్రాలు స్కూల్ పిల్లలకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం అనాధలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర క్యాబినెట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ తీసుకొన్న నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్ కు జై జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ఇతర నేతలు కృష్ణవేణి, భగవాన్, రవిశంకర్, నగేష్ ఆశ్రమ వ్యవస్థాపకులు సూరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.