విజయవాడ : రాష్ట్రంలో కులగణన చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే దానికి చట్టబద్ధత కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాడ్ చేశారు. ఆర్థిక సామాజిక సర్వే తరహాలో వలంటీర్ల చేత కుల గణన చేస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఇది కుల అసమానతలను తగ్గించడానికి చేస్తున్నట్లు లేదు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం, బీసీలను మభ్యపెట్టడానికి చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో జన గణనతోపాటు రాష్ట్రంలో కులగణన చేస్తే అది సమగ్రంగా,వివాదాలకు అతీతంగా ఉం టుంది. దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు కోరారు.