అమరావతి, అభి మీడియా సొల్యూషన్స్ ప్రతినిధి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అమ్మా పురందేశ్వరి గారూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు. అంటే.. మీది కుటుంబ రాజకీయమా?. కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?. లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా?’’ అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్. మళ్లీ బీజేపీ ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుందని మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/vijai%20.jpg]
[https://bloomtimes.org/images/Hemalatha_/vijai%20.jpg]