విజయవాడ : న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. హైదరాబాద్లో ఆరోగ్య పరీక్షల కోసం ఉన్న బుద్దా వెంకన్నకు హైదరాబాద్ వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు ఇస్తున్నట్టు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై బుద్దా వెంకన్న వెంటనే తగిన వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.