పల్నాడు : అధికారం ఉండే ఈ ఆరునెలలైనా ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగు సంక్షోభం, రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని సూచించారు. రైతు ఆత్మహత్యల్లో ఇప్పటికే ఏపీ 3వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2.45 లక్షల సగటు అప్పు ఉందని తెలిపారు. ఇదే అలసత్వం కొనసాగిస్తే పరిస్థితి మరింత చేయి దాటే ప్రమాదం ఉందన్నారు. ఉన్న కష్టాలు చాలవన్నట్లు రాష్ట్రంలో కరవు ఉరుముతోందని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కరవు తీవ్ర స్థాయిలో ఉందన్నారు. వేళాపాళ లేని కరెంటు కోతలో మరింత ఉసురు తీసుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎండిన పంట చేలల్లోకి వెళ్లి చూడండి రైతుల కష్టాలేంటో కనిపిస్తాయని ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/prathhipati%20pullarao.jpg]