గుంటూరు : మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఏదోరకంగా మసిపూయాలనే రోజుకో అక్రమ కేసు పెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. శుక్రవారం నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ తండ్రి వైఎస్‌కు అధికారం ఉన్నప్పుడే రాష్ట్రాన్ని అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి దోచేశాడనటానికి సీబీఐ ఆధారాలతో సహా ఛార్జ్ షీట్లు దాఖలు చేసిందన్నారు. తెలుగుదేశం నేతలపై ఛార్జ్ షీట్లు లేకుండా తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్‌కు పంపి కక్షసాధించుకుంటున్నారు తప్ప ఎలాంటి అవినీతి లేదన్నది సుస్పష్టమన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం పోవటం, శాశ్వతంగా జైలుకు పోవటం ఎలాగూ ఖాయమని ఆయన అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణాలపై తెలుగుదేశం పోరాడుతున్నందుకే ఎదురు అక్రమ కేసులు పెట్టారని ఆనంద్ బాబు అన్నారు.