అమరావతి : సీఎం జగన్‌కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గతంలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల భద్రత లేకుండా, అభివృద్ధిలేని రాష్ట్రంగా బీహార్‌ను ఉదాహరణగా చూపించిన దేశం ఇప్పుడు ఏపీని చూపిస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర సర్వేలు వైఎస్సార్సీపీ కి సింగిల్ డిజిట్ కూడా రావని తేల్చేయటంతో చేసేది లేక చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను చేసిన అవినీతిపై భవిష్యత్తులో కేసులు తప్పవని భావించిన జగన్, అవే అంశాల్లో చంద్రబాబుపై తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు రుద్ది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బోండా ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.