విజయవాడ : ఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులలో రివర్స్ టెండ”రింగ్”కు పాల్పడుతున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జల, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు అక్రమాలపై అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ప్రాజెక్టుల కోసం అర్హత లేని కంపెనీలకు 2.50 లక్షల ఎకరాల నిలువు దోపిడీ చేశారని ఆరోపించారు. సీమలోనే 1.50 లక్షల ఎకరాలు బినామీ కంపెనీల కోసం దోచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. షిర్డీసాయి ఇంజినీరింగ్ లిమిటెడ్ ఇండోసెల్ కంపెనీలు ఎవరి బినామీ కంపెనీలో తేలాలని ప్రశ్నించారు. విద్యుత్‌కు సంబంధించిన అన్ని రకాల టెండర్లు జగన్ అస్మదీయులకే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌హెచ్‌పీసీతో సీఎం ఫేజ్ 2 అవగాహన ఒప్పందాల పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.