అందులో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఐ.ఎన్.ఎస్ డేగాకు చేరుకున్న ఉప రాష్ట్రపతికి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జి.సుబద్ర, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహ రావు, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమీషనర్ ఎ.రవిశంకర్, జి.వి.ఎం.సి కమీషనర్ సిఎం. సాయి కాంత్ వర్మ , ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైనికుల గౌరవ వందనాన్ని ఉప రాష్ట్రపతి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, వి.ఎం.ఆర్.డి.ఎ సెక్రటరీ డి.కీర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.