విశాఖపట్నం : రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు విశాఖపట్నం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శనివారం ఏ.ఎం.సిలో జరగనున్న శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు విమానాశ్రయంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి విడదల రజని, నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జి.సుబద్ర, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమీషనర్ ఎ.రవిశంకర్, రెవిన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, తదితరులు గవర్నర్ కు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.