పశ్చిమగోదావరి జిల్లా : పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు.