కొవ్వూరు, సూర్య బ్యూరో ప్రతినిధి : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ తో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం లోని చాగల్లు మండలంలోని చాగల్లు-5 సచివాలయ పరిధిలో మీనానగరం, కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామాల్లో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను హోంమంత్రి వివరించారు. క్యాంపుల వద్ద ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రారంభించి స్టాల్స్ ను పరిశీలించారు. ఐసిడిఎస్ అంగన్వాడి ద్వారా గర్భిణీ, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటకాలను పరిశీలించి స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజలకి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ప్రజల యోగ క్షేమాలు, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఈ రోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నారని మన ఇంట్లో మన ఆరోగ్యం గురించి ఎలా అయితే చిత్తశుద్ధిగా ఆలోచిస్తారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారని, ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని హెంమంత్రి తెలిపారు. వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సంక్షేమం ఇంటిముంగిటనే అందించడమే కాకుండా వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ద చూపుతున్నారన్నారు. అంతేకాకుండా రోజుకి ఒక సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.