కమ్యూనికేషన్స్ ఎడ్వైజర్ జి.వి.డి.కృష్ణమోహన్
వెలగపూడి : వరసగా మూడో సంవత్సరం, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డుల్ని కమిటీ ప్రకటిస్తోంది. కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీ దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సభ్యులు వున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకు కమిటీ మూడేళ్ళుగా ఎంపిక చేస్తోంది. తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వారిని, జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ ఎంపిక చేయటం జరిగింది. ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైయస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులు, 4 ఎచీవ్మెంట్ అవార్డులు వున్నాయి.
2023లో వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక : వ్యవసాయంలో పంగి వినీత,(ఎచీవ్మెంట్ అవార్డు), వై.వి.మల్లారెడ్డి (అనంతపురం) ఉన్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ లో యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు (శ్రీకాకుళం), తలిసెట్టి మోహన్, కలంకారీ (తిరుపతి), కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ (బాపట్ల), కోన సన్యాసి, తప్పెటగుళ్ళు (శ్రీకాకుళం జిల్లా), ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (కాకినాడ). ఎస్.వి రామారావు, చిత్రకారుడు (కృష్ణా), రావు బాల సరస్వతి, నేపథ్య గాయని ( నెల్లూరు), తల్లావఝుల శివాజీ, చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– (ప్రకాశం), చింగిచెర్ల కృష్ణారెడ్డి, జానపద కళలు (అనంతపురం), కలీసాహెబీ మహబూబ్, షేక్ మహబూబ్ సుబానీ దంపతులు, నాదస్వరం (ప్రకాశం) ఉన్నారు.
తెలుగు భాష– సాహిత్యం లో ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం (పశ్చిమ గోదావరి), ఖదీర్ బాబు, నెల్లూరు (ఎచీవ్మెంట్ అవార్డు) మహెజబీన్, నెల్లూరు (ఎచీవ్మెంట్ అవార్డు), నామిని సుబ్రహ్మణ్యం నాయుడు (చిత్తూరు), అట్టాడ అప్పలనాయుడు (శ్రీకాకుళం) ఉన్నారు. క్రీడా విభాగంలో పుల్లెల గోపీచంద్ (గుంటూరు), కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం) ఉన్నారు . వైద్యం విభాగంలో ఇండ్ల రామ సుబ్బారెడ్డి, మానసిక వైద్యం (ఎన్టీఆర్), ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్ (వైయస్సార్) ఉన్నారు. మీడియా విభాగంలో గోవిందరాజు చక్రధర్ ( కృష్ణా), హెచ్చార్కే ( కర్నూలు) ఉన్నారు. సమాజ సేవలో బెజవాడ విల్సన్ (ఎన్టీఆర్), శ్యాం మోహన్, అంబేద్కర్ కోనసీమ (ఎచీవ్మెంట్), నిర్మల హృదయ్ భవన్ ( ఎన్టీఆర్), జి. సమరం ( ఎన్టీఆర్) ఉన్నారు.