ఈ నాలుగు సంవత్సరాల్లో రూ.2 లక్షల 38వేల కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి ‘జగనన్న చేదోడు’ సాయం అందజేసిన సీఎం జగన్
కర్నూలు : ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అదే గతంలోని చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోను, ఎన్నికల హామీలను చెత్తబుట్టలో పడేసిందని గుర్తు చేశారు. జగన్న చేదోడు కార్యక్రమం కోసం గురువారం ఎమ్మిగనూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అప్పుడు-ఇప్పుడు అదే రాష్ట్రం.. అదే బడ్జెట్. మారిందల్లా ముఖ్యమంత్రే. గతానికి ఇప్పటికీ ఒకేఒక్క తేడా. మీ బిడ్డ మనసు. బటన్ నొక్కితే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. అప్పట్లో గజదొంగల ముఠా దోచుకుంటే ఇప్పుడు మీ బిడ్డ నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాడు. ఎక్కడా ఎవరూ లంచాలు అడగడం లేదు. వివక్ష చూపడం లేదూ, ఇవన్నీ గమనించాలని, ఆలోచన చేయాలని ప్రజలను సీఎం జగన్ కోరారు.
‘ఆలోచన చేయమని అడుగుతున్నా..పేదరికంలో ఉన్నవాళ్లు ఏం కోరుకుంటారు? తమ కుటుంబానికి వైద్యం అవసరమైతే అది ఎన్ని లక్షలైనా సరే మంచి మనసుతో తోడుగా నిలిచే ప్రభుత్వం రావాలి. కావాలి అని కోరుకుంటుంది. తమ ఆత్మగౌరవం కాపాడుతూ.. పౌర సేవలు అందించే ప్రభుత్వం కావాలి అని కోరుకుంటుంది. ఒక ఇంటి స్థలం అవసరం అయినప్పుడు ఆ అవసరం గుర్తించే ప్రభుత్వం రావాలి.. కావాలి అని కోరుకుంటుంది. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేసే ప్రభుత్వం కావాలి.. రావాలి అని కోరుకుంటుంది. ఒక పేద కుటుంబం తమ పిల్లలకు మంచి చదువులు చదివించే మేనమామ సీఎంగా ఉండాలని కోరుకుంటుంది. పేదింటి అక్కచెల్లెమ్మలు తమ సాధికారతకు ఒక మంచి అన్నయ్య. ఒక మంచి తమ్ముడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి మార్పులు ప్రతీ కుటుంబంలో మన కళ్ల ఎదుటే కనిపించే విధంగా ఆ పాలన అందుబాటులోకి వస్తే అలాంటి పాలనను ఏమంటారు?. ఆలోచన చేయండి. అలాంటి పాలన కనిపిస్తే, పాలన వస్తే ఏమంటారో తెలుసా?.. అదీ మా పాలన..మనందరి పాలన.. మీ బిడ్డ పాలన..అది మీ అన్న..మీ తమ్ముడు..‘‘జగనన్న పరిపాలన’’ అంటారు. అదే గతంలో చంద్రబాబు పాలన చూస్తే.. కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మా వాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఆ కుప్పంలో పేదవాడికి ఇంటి స్థలం కావాలంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే.. 20 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వానిదే అని సీఎం జగన్ తెలిపారు. అప్పట్లో బాబు ముఖ్యమంత్రి అయితే ఏదో జరుగుతుందని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ ప్రచారం చేసుకున్నారు. రూ.87, 012 వేల కోట్లు రూపాయలు రుణ మాఫీ చేస్తానన్నారు. కానీ, అధికారంలోకి రాగానే సున్నావడ్డీ పథకం ఎత్తేశారు. బాబు హయాంలో పొదుపు సంఘాలు విలవిల్లాడిపోయాయి. రుణమాఫీ రూ. 5వేల కోట్లు కూడా చేయలేదు బాబు హయాంలో జరిగింది స్కిల్స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, చివరకు.. మద్యం కొనుగోళ్లలో కూడా దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం.. ఇది తప్ప ఏదీ కనిపించలేదు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. చివరకు నిరుద్యోగల్ని మోసం చేశారు. అన్నింటా చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది. మీ బిడ్డ పాలనలో అదే ఈ నాలుగు సంవత్సరాల్లో రూ.2 లక్షల 38వేల కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడ్డాయి. 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. ఎక్కడా అవినీతి లేకుండా వివక్ష లేకుండా జమ అవుతోంది. మ్యానిఫెస్టోలో 2019 లో మ్యానిఫెస్టోలో పెట్టిన 99 శాతం అమలుచేశాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందిరీక ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. మీ బిడ్డ పాలనలో ఆరోగ్యశ్రీని విస్తరించాం. చికిత్స తర్వాత కూడా రోగికి సాయం అందిస్తున్నాం. ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఎస్టీలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం. చంద్రబాబు వల్ల నష్టపోయిన సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నాం. ఏ గ్రేడ్ మహిళ సంఘాలు గా అభివృద్ధి చేశాం. 31 లక్షలు ఇంటి స్థలాలు,పట్టాలు అందించాం. దాదాపు మంది కోటి మంది ప్రజలకు లబ్ది చేకూర్చాం. 4 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, మీ బిడ్డ పాలనలో 2లక్షల 7 వేల ఉద్యోగాలు వచ్చాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేకూర్చాం. 18 మెడికల్ కాలేజీలు మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో తీసుకువచ్చాము. ఈ జిల్లాలో ఆదోనీలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. సుమారు 108,104 వాహనాలు 1,600 కొనుగోలు చేశామన్నారు.
గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. గతంలో పేదవాడి గురించి ఆలోచన, ఎలా బతుకుతాడనే ఆలోచన చేసిన పరిస్థితి లేదు. పైగా అవమానించిన చరిత్ర కూడా ఉంది. రాజధాని అంశంలో నిసిగ్గుగా పేదవాడికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిన పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ప్రతీ వర్గం నాది అనుకునే మీ బిడ్డ ప్రభుత్వం నిలబడ్డాయి. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ కురక్షేత్ర సంగ్రామం కులాల మధ్య కాదు.. ఇది క్లాస్ వార్ అని, పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉండి యుద్ధం జరగబోతోంది. చల్లని దీవెన మాత్రమే మీ బిడ్డకు ఉన్నాయన్నారు. మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఎవరినీ నమ్ముకోలేదు. ఓటు వేయడానికి వెళ్లే ముందుకు ఒక్కటే ఆలోచన చేయండి. వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? అనేది కోలమానంగా తీసుకోండి. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుకుంటూ సెలవు.. అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ముగించారు.