విశాఖపట్నం : విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం 10.35 నిముషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇంచార్జి మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, లోక్ సభ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ, వి.సత్యవతి, గొట్టేటి మాధవి, డి.సి.సి.బి. చైర్మన్ కోలా గురువులు, ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్, సి.ఎం.డి. పృద్వీరాజ్, ఎడి.సి.పి. ఆనంద్ రెడ్డి, ఆర్.డి.ఒ. హుస్సేన్ సాహెబ్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.