ఏపీలోనే ఉన్నా..విచారణకు హాజరయ్యా : కిలారు రాజేష్
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్ హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చారు. స్కిల్ కేసులో తనను అరెస్టు చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఉన్నట్లు సీఐడీ ఏడీజీ మీడియా వద్ద వెల్లడించారని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కిలారు రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని, ఒకవేళ చేరిస్తే సీఆర్పీసీ సెక్షన్ 41ఎ ప్రకారం నోటీసు ఇచ్చి విచారిస్తామని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణను హైకోర్టు మూసివేసిన విషయం తెలిసిందే.
ఏపీలోనే ఉన్నా..విచారణకు హాజరయ్యా : కిలారు రాజేష్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో కిలారు రాజేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సోమవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ రెండు రోజుల కిందట కిలారు రాజేష్ కు సీఐడీ అధికారులు 41సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. కిలారు రాజేశ్ టీడీపీ యువనేత నారా లోకేశ్ కు సన్నిహితుడు అని వైసీపీ నేతలు చెపుతున్న సంగతి తెలిసిందే. రాజేశ్ విదేశాలకు పారిపోయారని ఇటీవల ప్రెస్ మీట్ లో సీఐడీ అధికారులు చెప్పారు. దీనిపై రాజేష్ స్పందిస్తూ తాను విదేశాలకు పారిపోలేదని చెప్పారు. తాను ఏపీలోనే ఉన్నానని తెలిపారు. సీఐడీ విచారణకు సహకరిస్తానని చెప్పారు. మరో వైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును రాజేశ్ ఆశ్రయించారు. గత శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అయితే రాజేష్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని, ఆయనను అరెస్ట్ చేయబోమని, 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. అరెస్ట్ లేనందువల్ల ముందస్తు బెయిల్ పై ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు వెల్లడించింది.