విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయవాదుల పిటిషన్పై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు నివేదించారు.