అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘మద్యం కుంభకోణంలో మీ పార్టీ పాత్ర ఏమిటి? మీ అల్లుడు శరత్ చంద్ర రెడ్డి పాత్రేమిటి?. విశాఖ దసపల్ల భూములను కూతురుని అడ్డంపెట్టుకొని పల్లీలు నమిలినట్టు నమిలిన విజయసాయి రెడ్డి రామాయపట్నం పోర్ట్లో మీ కుటుంబ పాత్ర, దాన్ని రాబట్టుకోవడానికి చేసిన అక్రమ జీఓ ఎలా ఇప్పించుకున్నారో చర్చిద్దాం. ఫోన్లలో సమాచారం దొరికితే ఎక్కడ దొరికిపోతామని పగిలిన ఫోన్లు ఏవరివి? మా ఫోన్లు మాత్రం పగలలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ ఫోన్ పగిలింది, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కాంలో ఇంకేమి పగులుతాయో చూద్దాం. నాసిరకపు మద్యం తయారీ ఉత్పత్తిలో మీ అల్లుడి కుటుంబం లేదా? ఇవ్వన్ని బయట పడతాయని మా పైన నిందలా? ఈ మధ్య కొంత కాలం విజయసాయి రెడ్డి కనపడుట లేదు అన్నారు, జగన్మోహన రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి మరల ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మధ్యలో విజయసాయి రెడ్డి భాష సంస్కారవంతంగా మారింది, కాని ఇప్పుడు తన సహజ ధోరణి బయటపడుతుంది’’ అంటూ లంకా దినకర్ ట్వీట్ చేశారు.