విజయవాడ : ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఆ కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనని, వేరే చెప్పనవసరం లేదని దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్లాని సవాల్ విసిరారు. మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో సీఎం జగన్ చెప్పారని ఈ సందర్భంగా పురందేశ్వరి గుర్తుచేశారు.