రాధాకృష్ణ ఎలా కోట్లకు పడగలెత్తారు? : ‘‘అసలు 3 దశాబ్దాల్లో ఎప్పుడైనా ఏపీలో కానీ, కుప్పంలో గానీ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదా?. ఇక పవన్ కళ్యాణ్ ఏపీనీ పొలిటికల్ టూరిస్ట్‌గా వాడుతున్నారు. పవన్ పోటీ చేయడానికి ఏపీ కావాలి.. గాజువాక కావాలి.. కానీ ఇక్కడ నివాసం వుండాలని అనుకోరు. రోశయ్య గారు చెప్పేవారు. సైకిల్ చైన్ ఉడిపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ఛాంబర్‌కి వచ్చి శుభ్రం చేసుకొనేవారనీ. ఇప్పుడు రాధాకృష్ణ ఎలా కోట్లకు పడగలెత్తారని మంత్రి నిలదీశారు.
గీతం భూ ఆక్రమణలు కనిపించవా? : టీడీపీ అండ్ కో ఏపీనీ అవసరాలకు వాడుకుంటుంది. రుషి కొండ గురించి మాట్లాడే నాయకులకు గీతం భూ ఆక్రమణలు కనిపించవా ?. 27 ఎకరాలు భూమిని ఆక్రమించిన గీతం యాజమాన్యం నుంచి దాదాపు వెయ్యి కోట్ల విలువ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. టీడీపీ రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తే, జగన్ ప్రభుత్వం జనం కోసం ఆలోచిస్తుందని మంత్రి పేర్కొన్నారు.