జనసేన, టీడీపీ కలిసి పోటీచేసినా కొవ్వూరులో వైసీపీదే గెలుపు *మన లక్ష్యం వై నాట్ 175 * పేదరిక నిర్మూలన కోసమే జగనన్న అనేక సంక్షేమ పథకాలు అమలు * ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ శ్రేణులంతా సమాయత్తంగా ఉండాలి * కొవ్వూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి దిశా నిర్దేశం * హోంమంత్రి తానేటి వనిత ప్రవర్తన, వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శమని కితాబు * ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, రాజాంపేట పార్లమెంటు సభ్యులు పి.మిథున్ రెడ్డి
కొవ్వూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం నేతలంతా విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, రాజాంపేట పార్లమెంటు సభ్యులు పి.మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హోమ్ మినిస్టర్ క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర హోమ్ మినిస్టర్ తానేటి వనిత అధ్యక్షతన నిర్వహించిన కొవ్వూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో విస్తృత సాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు పి.మిథున్ రెడ్డి, పిల్లిసుభాష్ చంద్రబోస్,జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు రాజీవ్ కృష్ణ, యువజన విభాగ రిజనల్ కో- ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమావేశానికి ముందుగా హోంమంత్రి క్యాంపు కార్యాలయం నందు రీజనల్ కో-ఆర్డినేటర్ల సమక్షంలో వై.ఎస్.ఆర్ జెండా ఎగురవేసి అనంతరం దివంగత నేత వై.యస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజాంపేట పార్లమెంటు సభ్యులు పి.మిథున్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు మాట్లాడిన మాటలు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయని, వారు చేసిన సూచనలు, సలహాలు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఒకప్పుడు కొవ్వూరు నియోజవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని.. 2019లో తానేటి వనిత ఘన విజయంతో నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డుతో సృష్టించడమే కాకుండా టీడీపీ కంచుకోటకు బీటలు తీసేలా చేసిన ఘనత హోంమంత్రి తానేటి వనితకు దక్కుతుందన్నారు. 2014లో కార్యకర్తలు,నాయకులు ఎన్నో ఇబ్బందులు పడి, కేసులు పెట్టించుకోని కొవ్వూరు నియోజవర్గాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లోనే టాప్ ప్లేస్ లో నిలిపారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నంత వాతావరణం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కి, తెలుగుదేశం పార్టీకి మధ్య ఉండేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క నాయకుడిని మరువమని.. అందరికీ తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. ఎక్కడైనా చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే తమ వద్దకు తీసుకొస్తే వెంటనే పరిస్కరిస్తామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జగనన్న ప్రభుత్వం ఏ విధంగా చేరువైందో అందరికి వివరించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలోని అవినీతి, జన్మభూమి కమిటీల నిర్వాకాలు అన్నీ ప్రజలకు తెలియజేయాలన్నారు. గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో క్యాడర్ అంతా కలిపి ఒక సన్నాహక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తామన్పారు. అలాగే నియోజకవర్గాల్లో బస్ యాత్ర నిర్వహిస్తామని, కొవ్వూరులో బలమైన నాయకత్వం ఉందని మేము ఖచ్చితంగా గెలిచే సీట్ అని చెప్పే విధంగా ఆ కార్యక్రమం కూడా నిర్వహించాలని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే మా సర్వేల ప్రకారం తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నియోజకవర్గాల్లో కొవ్వూరు నియోజవర్గం ముందు వరుసలో ఉందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సర్వేలు కూడా కొవ్వూరు నియోజకవర్గానికి పాజిటివ్ గా ఉందని తెలిపారు. తానేటి వనిత ప్రవర్తన, ఆమె వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శంగా ఉంటుందన్నారు. ఇప్పుడున్న నాయకుల్లో హోంమంత్రి తానేటి వనితకు ప్రత్యేక స్థానం ఉందని, చిన్నస్థాయి కార్యకర్త నుంచి పెద్దస్థాయి నాయకుల వరకూ అందరినీ సమానంగా ఆదరించే వ్యక్తిత్వం తమకు కూడా ఇష్టమన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత ఇష్టమైన నాయకుల్లో హోంమంత్రి తానేటి వనిత కూడా ఒకరని మిథున్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మాట్లాడుతూ.. రానున్న సార్వత్రక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఏ విధంగా సమాయత్తం చేయాలనే ఉద్దేశ్యంతో కొవ్వూరు నియోజవర్గ విస్తృతస్థాయి సమావేశం రీజనల్ కోఆర్డినేటర్లు పి.మిధన్ రెడ్డి మరియు పి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఈ సమావేశం విజయవంతం కావడం సంతోషానిచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ఆనుసారం కొవ్వూరు నియోజవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని.. అందులో భాగంగా 62 సచివాలయాలలో 42 సచివాలయాను ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగనన్న పాలనలో కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 12 శాతం పేదరికం ఉంటే అది నేడు జగనన్న పాలనలో 6 శాతానికి తగ్గిందని, ఈ గణాంకాలను పరిశీలిస్తే జగనన్న పాలనలో పేదల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వివరించారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకి ఒక మేనమామ లాగా అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. జగనన్న పాలన జరిగిన అభివృద్ధి, సంక్షేమం వలన గ్రామంలో ప్రతి ఇంటికి స్వేచ్ఛగా వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నామని.. 2019 సంవత్సరంలో ఏవిధంగా కలిసి పనిచేసామో అదే మాదిరిగా మనమందరం పనిచేసి రానున్న సార్వత్రిక ఎన్నికలలో కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని జగనన్నకు కానుక ఇద్దామని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ కాలు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజల నుండి సంపన్నుల వరకు రైతుల నుండి భూస్వాములు వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలకు ఏదో పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందన్నారు. నాలుగేళ్ల రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో 1/3 వంతు కేవలం సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. 2 లక్షల 35 వేల కోట్లను నేరుగా డి.బి.టి ద్వారా లబ్ధిదారుల అకౌంట్లోనే నగదును వేసిన ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఒక లక్ష 30 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి ఖర్చు చేయడం జరిగిందని, వ్యవసాయ రంగ ఆధారితమైన హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలలో లలో కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరి మన్నలను పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, విపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని పట్టించుకోకుండా పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి గెలుపులో భాగస్వాములు అవ్వాలన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్న చిన్న బేధాభిప్రాయాలు ఉండడం సహజమైనని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభ సమయం లో గ్రామ నాయకులు ఆలోచన విధానం ఒక విధంగా ఉంటే గ్రామంలో కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ప్రజల నుండి వస్తున్న ఆదరణ స్పందన చూసి గ్రామస్థాయి నాయకులలో జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాల అమలల్లో ఏటువంటి మధ్యవర్తులు,లంచాలు లేకుండా నేరుగా ప్రజల దగ్గరికి పరిపాలనను అందిస్తూ తలుపుతట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించారన్నారు. గత ప్రభుత్వంలో ఒక ప్రాంత అభివృద్ధికి మాత్రమే నిధులు వెచ్చిస్తే,నేడు జగనన్న పాలలో గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామాలలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం సచివాలయాల నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రజల కోసం జలజీవన్ మిషన్ పథకంలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి త్రాగునీరు అందించ డమే కాక పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు అందించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.. రాబోయే మూడు నాలుగు నెలల పూర్తిస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి,ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మన అందరం పనిచేసి వై నాట్ 175 లక్ష్యంలో భాగస్వాములు అవ్వాలన్నారు. పార్టీ శ్రేణులు అందరూ పూర్తి సమయాన్ని పార్టీ కోసం వెచ్చించి ప్రతి గ్రామం మరొక గ్రామంతో పోటీపడి అత్యంత మెజార్టీయే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందరూ కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. ఎం.పీ మార్గాని భరత్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. పరిపాలనలో నూతన ఓరవడిని తీసుకువస్తూ ప్రతి పథకాన్ని అర్హులైన వారికి అందిస్తున్నారన్నారు. పార్టీలో విభేదాలకు మనస్పర్ధలకు తావు లేకుండా ఒకరికి ఒకరు సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి అత్యధిక నియోజక వర్గంలలో గెలుపే మన లక్ష్యం అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకు రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని వ్యూహాత్మకం గా ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నాయకులు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కొవ్వూరు నియోజకవర్గం అందుకు ఉదాహరణ అని, మంత్రి తానేటి వనిత సారధ్యంలో కొవ్వూరు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వనితక్కను మరోసారి గెలిపించుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, మూడు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కొవ్వూరు నియోజకవర్గ మండలాల పార్టీ అధ్య క్షులు, జేసీఎస్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు తదితరులు హాజరయ్యారు.