అల్లూరి జిల్లా : వైసీపీ ప్రభుత్వం అవినీతి పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును రిమాండ్ చేస్తే బాబు చేసిన అభివృద్ధి తెలుగువారు ఉన్న ప్రతి చోట జాతీయ, అంతర్జాతీయంగా బయటకు వచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ సందర్బంగా బుధవారం పాడేరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదని, అంధకారంలోకి వెళుతుందని, ఇప్పటికే రోడ్లు గోతులు పడి వున్నాయని, మళ్లీ వస్తే రోడ్లు నూతులై కనిపిస్తాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఏజెన్సీలో రెడ్డీలను దింపి దోచుకున్నారని ఆరోపించారు.