విజయవాడ : రాష్ట్ర విద్యుత్ ,అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం మంత్రి పెద్దిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనను హైదరాబాదులోని నివాసంలో కలిసిన ఆకుల శ్రీనివాస్ మంత్రికి దుర్గగుడి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి శాలువా, పూల బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల మనిషైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ కనకదుర్గమ్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందజేయాలని ఆకాంక్షించారు.