అమరావతి : లేని ఐఆర్ఆర్ విషయంలో విచారణ చేపట్టడం హాస్యాస్పదమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా అమరావతి రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టించే ఎమ్మెల్యే ఆర్కే 2022 ఏప్రిల్లో ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఐఆర్ఆర్ ప్రతిపాదనలో ఉన్న 2000 ఎకరాలను క్షుణ్ణంగా పరిశీలించకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు. ఐఆర్ఆర్ లేదని, భూమి సేకరించలేదని, నిధులు కేటాయించలేదని సీఆర్డీఏ అధికారులే ప్రకటించారని తెలిపారు. మార్చి 21, 2014లో హెరిటేజ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ భూముల కోనుగోలుకు నిర్ణయించారు. అప్పటికి ఎన్నికలే జరగలేదన్నారు. జూన్ 8, 2014న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారని పంచుమర్తి అనురాధ చెప్పుకొచ్చారు.