విజయవాడ : మున్సిపల్ కమిషనర్ వైసిపి నాయకుల అక్రమ నిర్మాణాలు చేస్తూంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే వైసిపి అవినీతిపరుల అక్రమ నిర్మాణ దారుల్ని మీరు ప్రోత్సహించినట్లే అవుతుందని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 52 వ రోజు 45 వ డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు గోవింద లక్ష్మి ల ఆధ్వర్యంలో కొండ బడి ఎదురు రామకోటయ్య వీధి వద్ద నుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్తుంటే స్ధానిక ప్రజులు అనేక సమస్యలు చెప్తున్నారు, మమ్మలని పట్టించుకునే నాథుడే లేడు, మేము పిలిస్తే పలికే స్తానిక ప్రజా ప్రతినిధులు లేరని, పార్టీ మారితే మాసమస్యలు తీరుస్తారనుకుంటే స్థానిక కార్పొరేటర్ కనిపించకుండా పోయాడని ప్రజలు వాపోతున్నారు. కొండ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టి వారి సమస్యలు పరిష్కరించాలని , కొండ ప్రాంతంలో నిధులు కేటాయించి పాడైన మెట్లు, డ్రైనేజీ లు బాగు చేయాలని, పారిశుధ్యం మీద దృష్టి పెట్టాలని కోరారు. ఈ మంచి పనుల మీద దృష్టి పెడితే ఒక మంచి కమిషనర్ గా పేరు వస్తుంది. కానీ మీరు వైసిపి నాయకుల అక్రమ నిర్మాణాలు చేస్తూంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే వైసిపి అవినీతిపరుల అక్రమ నిర్మాణ దారుల్ని మీరు ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు.
దసరా ఉత్సవాల గురించి ఈవో ల బదిలీ గందరగోళం : మాజీ దేవాదాయ శాఖ మంత్రికి ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రికి మధ్య ఆధిపత్య పోరు వుంటే దానికి భక్తులు ఇబ్బంది పడాలా?. దసరా ఉత్సవాల గురించి ఈవోల బదిలీ చాలా గందరగోళంగా వుందని, మీరు బదిలీలు చేయాలనుకుంటే ముందుగానే చేయ్యాల్సిందని, చేసినా కూడా మంచి సమర్ధమంత మైన అధికారినీ నియమించి ఉంటే బాగుండేదన్నారు. గతంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు ఈవోలు గా చేశారని, కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు అమ్మవారి ఆలయానికి ఐఏఎస్ అధికారులను ఈవోలుగా నియమించడం లేదని ప్రశ్నించారు. ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు ఈవో గా నియమించడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటన్నారు.
ఉత్సవాలు మొదలవ్వడానికి ఇంకా 5 రోజులు కూడా లేవని ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని , పర్యవేక్షణ లోపం వుందని, శాఖల మధ్య సమన్వయం లేదన్నారు. ఏ విధంగా ఉత్సవాలు విజయవంతం చేస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాజీ దేవాదాయశాఖ మంత్రికి, ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రికి మధ్య ఆధిపత్య పోరు ఉంటే దానికి భక్తులు ఇబ్బంది పడాలా అన్నారు. కాంట్రాక్టుల మీద కమిషన్ల కక్కుర్తి వల్ల భక్తులు ఇబ్బంది పడాలా అన్నారు. దసరా ఉత్సవాలలో భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలిగినా , ఏ చిన్న అపశృతి కలిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మ గోవింద్ లక్ష్మి, శనివారపు శివ, క్రిష్, కూర్మా రావు, రాము గుప్తా, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్ ,గన్ను శంకర్, గంజి పవన్, శ్రీను, బంటుమిల్లి రాంబాబు, దాసిన జగదీష్, నోచరాల పవన్ కళ్యాణ్, అఖిలతదితరులు పాల్గొన్నారు.