సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ముందుగా జారీ చేసిన పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. *గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజకవర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికి చేసిన మంచిని మరింత ప్రభావవంతంగా వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు. ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు.
ప్రతినిధులకు ఘుమఘమలాడే విందు భోజనం : వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఘుమఘమలాడే విందు భోజనం ఏర్పాటు చేశారు. అందులో చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ 65, పీతలపులుసు, అపోలో ఫిష్, బొంబిడాయల పులుసు, కోడిగుడ్డు వేపుడు, రొయ్యల కూర, బ్రెడ్ హల్వా, పెరుగు చట్నీ, సాంబార్, పప్పు, ఐస్ క్రీం, కిళ్లీ సహా పలు వెజ్ వంటకాలు సిద్ధంగా వున్నాయి. కౌంటర్ల వారీగా భోజన ఏర్పాట్లు చేసారు. మొత్తం 100కి పైగా వెజ్ అండ్ నాన్ వెజ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.