తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వులు
విజయవాడ : విజయవాడలోని దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్న ఆయనను దుర్గ గుడి ఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబను బదిలీ చేస్తూ అక్టోబరు 1న రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం. శ్రీనివాస్‌ను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అయితే శ్రీనివాస్ విధుల్లో చేరకపోవడంతో తాజాగా కేఎస్ రామారావును నియమించింది.