టీడీపీ నేతల నోటికి అడ్డూ అదుపూలేకుండా పోయింది
ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు : చంద్రబాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా.? అని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కష్టపడుతోందని దుయ్యబట్టారు. కోర్టులో చంద్రబాబు లాయర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారన్నారని విమర్శించారు. తండ్రి అరెస్ట్ అయితే కొడుకు ఢిల్లీలో కూర్చుని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూశాడంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 42 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల కోసం రూ.3,700 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబు చీకట్లో కలిసిపోయాడు.. ఆయన జీవితం చీకటిమయం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిని ఇంటింటికి తెలియజేయాలని లోకేష్ చెప్పాడు. మంత్రి స్థాయిలో ఉన్న రోజాను విమర్శించడం సిగ్గుచేటు. టీడీపీ నేతల నోటికి అడ్డూ అదుపూలేకుండా పోయిందని మంత్రి ధ్వజమెత్తారు. అవినీతి గురించి మాట్లాడకుండా అరెస్టు అక్రమమని టిడిపి నేతలు చెబుతున్నారని, చంద్రబాబు అవినీతికి పాల్పడటం లేదని కోర్టు లకు చెప్పడం లేదు. సెక్షన్ ల గురించే చెబుతున్నారన్నారు. టీడీపీ కార్యక్రమాలకు ప్రజలు రావడం లేదని, ప్రజల్లో చంద్రబాబుకు ఎంత పరపతి ఉందొ దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని కాకాణి అన్నారు. అంతేకాకుండా ‘స్కిల్ కేసులో అవినీతి జరిగిందని ఇప్పటికే ఆదాయపన్ను శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు నిర్దారించాయి. ఒక వైపు చంద్ర బాబు కు మద్దతుగా రాయడం, మరో వైపు ఏదో ఒక శాఖ పై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. రైతు భరోసా కేంద్రాలపై ఈరోజు రాశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబుకి ఎందుకు రాలేదు. 2014 ఎన్నికల్లో రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. అప్పుడు పచ్చ మీడియా కు రైతులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
మంత్రి స్థాయిలో ఉన్న రోజాపై బండారు సత్యనారాయణమూర్తి ద్వారా మాట్లాడించడం పద్ధతి కాదు. అందుకే రోజాకు అందరూ మద్దతు తెలుపుతున్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తిపై స్థాయి దాటి మాట్లాడటం పై ఎవరు హక్కు ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలా విమర్శలు చేయలేదు. మహిళ అని చూడకుండా చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకుంటోంది. రైతు భరోసా కేంద్రాలకు ప్రధానమంత్రి పేరు కూడా పెట్టాం. మీలాగా కేంద్ర పథకాలకు మీరు స్టిక్కర్ తగిలించుకున్నట్టుగా మేము చేయలేదు. కాంతితో క్రాంతి అని కార్యక్రమం తో ఉన్న లైట్లు ఆర్పి చీకటిగా చేసి చిరు జ్యోతిని వెలిగించారని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ నిధులు దారి మళ్లాయి : టీడీపీ అబద్ధాలు మాట్లాడుతోంది. టీడీపీకి కాంతి లేకుండా చేస్తాం. దర్యాప్తులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డట్లు తేలింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులు దారి మళ్లాయి. చంద్రబాబు కోర్టులో తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు బాగానే ఉన్నాయని, సోమిరెడ్డి నాపై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారని, నాపై సోమిరెడ్డి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.