కొవ్వూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం లోని కొవ్వూరు మండలం కాపవరం, తాళ్లపూడి మండలం రావూరుపాడు గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… ప్రివెన్టివ్ హెల్త్ కేర్లో నూతన అధ్యాయానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ప్రజల యోగ క్షేమాలు, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఈ రోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నారని మన ఇంట్లో మన ఆరోగ్యం గురించి ఎలా అయితే చిత్తశుద్ధిగా ఆలోచిస్తారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారని, ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని మంత్రి అన్నారు. వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పరీక్షలు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రోజుకి ఒక సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి వాళ్ళకి యూనిఫామ్, వాళ్ళకి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.