సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విజయవాడ : విశాఖపట్నం రాజధాని అనే మాట అభాసు పాలైందని సిపిఐ జాతీయ కార్యదర్శి
నారాయణ అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా గంజాయి,బెట్టింగ్ దందా మొదలైందని
అన్నారు. ఆ దందా పరాకాష్టకు చేరి ఒక అనామకుడి దగ్గర 350 కోట్ల రూపాయల దొరికా
అంటే అలాంటి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయో తెలవదని పేర్కొన్నారు.
బెట్టింగ్ ముఠాగాన్ని, గంజాయి ముఠా గాని అధికార పార్టీ నాయకుల అండదండలు
లేకుండా జరగమని అన్నారు. విజయవాడ కేంద్రంగా వారిని కాపాడడం కోసం ప్రయత్నాలు
చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ కేంద్రంగా ఎమ్మెల్యేలు ముఖ్య నాయకుల
సహకారంతోనే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేవలం రాష్ట్ర ప్రభుత్వమే
విచారణ జరిపించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈడి ద్వారా విచారణ జరిపించాలని
డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నం వైసిపి ప్రభుత్వం వచ్చాక మద్యం
మాఫియాగా మారిపోయింది, భూతందాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఈ ఘటనలపై
ఈడి, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.