విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
గురువారం హోమ్ మంత్రి తానేటి వనిత కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. హోం శాఖ
మంత్రి తానేటి వనిత అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ట్రస్ట్ బోర్డు
చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ
మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనము కల్పించారు. హోంమంత్రి తో పాటు నగర
మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం వీరికి వేదపండితులు
వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు,
శేషవస్త్రము అందజేశారు. అనంతరం వీరికి శ్రీ మల్లేశ్వర స్వామివారి దర్శనం
కల్పించారు. హోమ్ మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయముతో ఈ సంవత్సరం గత
సంవత్సరం కంటే మెరుగుగా దసరా మహోత్సవములు జరగాలని అమ్మవారిని, స్వామివారిని
ప్రార్తించినట్లు తెలిపారు.