గుంటూరు : ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు
నాయుడు తాను నిప్పును అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం నిజంగా సిగ్గు చేటని
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి
క్విడ్ ప్రోకో కింద రాష్ట్ర నిధుల్ని దోచేసి నిప్పు అని చంద్రబాబు
చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు తన హయాంలో చేసిన స్కాములు
ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
‘అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. మరి ఆ సమావేశాల్ని
నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి
వచ్చిందో చెప్పాలి. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ
అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లను సంబంధిత అధికారులు
బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అంటూ మాట్లాడటం సరికాదు. చంద్రబాబు
అరెస్టు తర్వాత ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించింది. చంద్రబాబు తప్పు
చేయకపోతే కోట్లు పెట్టి లాయర్లను ఎందుకు పెట్టుకుంటాడు. అన్ని ఆధారాలతో
చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు.