ఏలూరు : ఏలూరు జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదవ విడత కింద 10,490
మందికి రూ.10.49 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్
వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ నెల 29 తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.
10 వేలు చొప్పున జమచేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఆటో, టాక్సీ, మాక్సీ
క్యాబ్ లు నడుపుతూ జీవనం సాగించే వారికి వైఎస్సార్ వాహన మిత్ర ప్రథకం ద్వారా
ప్రభుత్వం ఏటా రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. 2019 నుంచి
ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేయగా ఇప్పుడు ఐదో విడత
సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి
జిల్లాలో 2019-20లో 17,101 మందికి రూ.17.10 కోట్లు,2020-21లో 19,521 మందికి
రూ.19.52 కోట్లు,2021-22 లో 18,015 మందికి రూ.18 కోట్లు అందజేయగా, ఏలూరు
జిల్లాలో 2022-23లో 10,303 మందికి రూ.10.30 కోట్లు ప్రభుత్వం అందజేసింది. ఐదవ
విడత గా 2023-24 లో 10, 490 మందికి రూ.10.49 కోట్లు శుక్రవారం విడుదల
చేయనున్నట్లు తెలిపారు.