విజయవాడ : భారతదేశ రైతుల ఆత్మ బంధువు, హరిత విఫ్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ
శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ మరణం భారత దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటు
అని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. గురువారం ఉదయం
చెన్నైలోని స్వగృహంలో స్వామినాధన్ మృతి చెందటం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం
చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మేలైన గోధుమ, వరి వంగడాలను సృ
ష్టించడంలో ఆయన కృషి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. వ్యవసాయ
ఆధారిత భారతదేశంలో తన సేవల ద్వారా రైతులకు అండగా నిలిచి, మేలైన వంగడాలతో
అత్యధిక దిగుబడులు సాధించడంలో గణనీయమైన పాత్ర పోషించారని తెలిపారు.
స్వామినాధన్ కుటుంబ సభ్యులకు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా
ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.