విజయవాడ పశ్చిమ : విజయవాడలో మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో ని సి వి ఆర్ ప్లై ఓవర్
దిగువున వున్న శ్రీదేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో శక్తి పీఠం 13
వ,వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వయంభూ గా వెలసిన శ్రీదేవీ
కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో కొలువై 13 ఏళ్ళు ఐన సందర్భంగా ఆలయంలోకి
ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఓం శక్తి పరాశక్తి నినాదాలు ఆలయ ప్రాంగణంలో
మార్మోగాయి. నవ హారతులతో అమ్మవారి కి విశేష పూజలు నిర్వహించారు. కాగా గత పది
రోజులుగా ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూర్ణాహుతితో
విఘ్నేశ్వరుని పూజలు ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన అన్నదానాన్ని పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు చేతులు మీదుగా ప్రారంభించారు. వందలాది మంది భక్తులు
అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు కరుమారి
దాసుతో పాటుగా క్రతువునిల నిర్వాహకులు జ్ఞానేశ్వర్,ఆలయ అర్చకులు దీక్షితులు,
వందలాది మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి
పీఠం లో శ్రీ మహా గణపతి నవరాత్రి మహోత్సవం ఈ నెల 18 నుండి 26 వరకు అంగ రంగ
వైభవంగా జరుగ్గా వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా పీఠంలో పీఠాధిపతి
శ్రీ కరుమారి దాస్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. మహా పూర్ణాహుతి స్వామీ
వారికి సమర్పించరు. ఈ పూర్ణాహుతి కార్యక్రమం లో చలువాధి ప్రకాష్ దంపతులు,శ్రీ
లక్ష్మి నారాయణ గుప్త,లతో పాటుగా 20 మంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. మరియు
వందలాది భక్తులు పాల్గొన్నారు.