గుంటూరు : లింగమనేనికి అనుకూలంగా రింగ్‌రోడ్డు తయారు చేశారని ఎలా చెబుతారని
టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. లేని రింగ్ రోడ్డుపై ఆర్కే
ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. హెరిటేజ్ కొన్న భూమి
అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు
ప్రాజెక్టు- వాస్తవాలు’ అంశంపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇచ్చారు.రాజధాని లేని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని భావించిన
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల ప్రకారం
నీటి వసతి, రవాణా సౌకర్యం ఉండి, రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని రాజధాని
నిర్మాణా నికి ఎంపిక చేశారని, అమరావతిగా రాజధానిని ప్రకటించినప్పుడు
ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి కూడా టీడీపీప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో
స్వాగతించారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. రాజధాని
నిర్మాణంలో భాగంగా అమరావతి ప్రాంతంలో నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్
ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని నేడు జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం
దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచన నాటి ప్రభుత్వం
చేసింది తప్ప, ఎక్కడా ఒక్క ఎకరం భూసేకరణగానీ, ప్రభుత్వం తరుపున నిధులు
కేటాయించ డం గానీ, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం గానీ ఏమీ జరగలేదని,
ఏమీ లేని దానిలో అవినీతి జరిగిందని చెప్పడం పిచ్చివాగుడేనని అనురాధ ఆగ్రహం
వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే
ఇలాంటి పిచ్చి అంశాల ను తెరపైకి తెస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు.