స్కిల్ డెవలప్ మెంట్ కేసును విచారించిన ఇన్ఛార్జ్ జడ్జి
ఒక్క రోజు వాదలను విని ఉత్తర్వులు ఇవ్వలేనన్న న్యాయమూర్తి
రేపటి నుంచి తాను సెలవుపై వెళ్తున్నానని వెల్లడి
అంగళ్లు అల్లర్ల కేసులో వాదనలు పూర్తి, బెయిల్పై తీర్పు రిజర్వ్
త్వరలో బెంచ్ మీదికి ఉండవల్లి పిటిషన్, సీబీఐ , ఈడీ కి ఇవ్వాలంటూ కేసు
విజయవా : టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ
బుధవారానికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ
బుధవారానికి వాయిదా పడింది. కస్టడి పిటిషన్పై చంద్రబాబు తరపు న్యాయవాదులు
దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్చార్జి
న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్ అంశాన్ని
చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా బుధవారం సీఐడీ కోర్టులో కోరాలని
న్యాయమూర్తి సూచించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న బెయిల్
పిటిషన్ తో పాటు ఆయన కస్టడీని పొడిగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల
విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు బుధవారానికి కి వాయిదా వేసింది. ఇప్పటి
వరకు ఈ కేసును విచారించిన జడ్జి మంగళవారం సెలవులో ఉండటంతో మెట్రోపాలిటన్
సెషన్స్ జడ్జి సత్యానందం ఈరోజు ఇన్ఛార్జి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
పిటిషన్లపై తమ వాదనలను వినాలని చంద్రబాబు, సీఐడీ తరపు లాయర్లు జడ్జి
సత్యానందంను కోరారు. అయితే, ఈ ఒక్క రోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం తనకు
కష్ట సాధ్యమని ఆయన చెప్పారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్తున్నానని
తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. దీంతో
బెయిల్, కస్టడీ పిటిషన్ లపై విచారణ బుధవారానికి వాయిదా పడింది