విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మత్స్యకార సంఘం రాష్ట్ర ఛైర్మన్ గా
విశాఖపట్నానికి చెందిన కే.జగన్నాధాన్ని నియమిస్తూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సోమవారం
నియామక ఉత్తర్వులను పీసీసీ అధ్యక్షులు చేతుల మీదుగా జగన్నాధం అందుకున్నారు.
ఫిషర్ మెన్ కమ్యూనిటీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి
క్రుషి చేస్తానని ఈ సందర్భంగా జగన్నాధం పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ
నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా
అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర
పద్మశ్రీ, ఏఐసీసీ సభ్యులు ధనేకుల మురళి, లీగల్ సెల్ ఛైర్మన్ వి.గుర్నాధం,
లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ జంధ్యాల శాస్త్రి, విశాఖపట్నం నగర కాంగ్రెస్
అధ్యక్షులు గంపా గోవింద్, నరసాపురం జిల్లా అధ్యక్షులు ఎం.శేఖర్ (బాబ్జీ)లు
పాల్గొన్నారు.