క్షణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్
ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా కేంద్రమంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్
పర్యటన
అమరావతి : విజయవాడ లో ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా పర్యటిస్తు పలు
అభివ్రుద్ది కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి డాక్టర్
భారతీ ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా కేంద్రమంత్రి
కార్యకర్తల ఇళ్లకు కూడా వెళ్లడం విశేషం. ఎన్టీఆర్ జిల్లా బిజెపి నేతలతోపాటు
రాష్ట్ర నేతలు కూడా మంత్రి వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రక్తదాన శిబిరంలో : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేబీఎన్ కళాశాలలో కేంద్ర
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా భాగంగా
ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజు ను
పురస్కరించుకుని కేబీఎన్ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భవ రక్తదానం శిబిరాన్ని కేంద్ర మంత్రి భారతీ
ప్రవీణ్ పవార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య సహాయం మంత్రి భారతి
ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం జిల్లాలోని జీజీహెచ్, ఏరియా
ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, హెల్త్
వెల్నెస్ సెంటర్లు ఆధునీకరించామన్నారు. సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2వ
తేదీ వరకు కొనసాగుతాయని ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని
రక్త హీనతతో ఉన్నవారిని ఆదుకోవడానికి రక్తదాన శిబిరాలను ప్రోత్సహించడం
జరుగుతుందన్నారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆమె
ప్రస్తావించారు.
మన్ కీ బాత్ : ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్
కార్యక్రమాన్ని విజయవాడ లో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆకాశవాణి
ద్వారా ఆసక్తిగా విన్నారు. ఒక శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
మన్ కీబాత్ వీక్షించారు. జి-20 సదస్సు విజయవంతం, చంద్రయాన్-3 విజయవంతం,
భారతదేశం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న తీరును ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ తెలుపగా ఎంతో ఆసక్తిగా ఆకాశవాణి ద్వారా టీవీ లో తిలకించారు. తమ
కార్యకర్తలతో కలసి కార్యక్రమాన్ని చూడటం సంతోషంగా ఉందని కేంద్రం మంత్రి
పేర్కొన్నారు.
వందేభారత్ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి : విజయవాడ నుండి చెన్నై కి వందే
భారత్ రైలును కేంద్రమంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ ప్రారంభించారు ఈ వందే
భారత్ రైలు టెంపుల్ సిటీ తిరుపతి మీదుగా చెన్నై వెళుతుంది. రైల్వేలను
పూర్తిగా ఆధునీకరించడం ద్వారా ప్రయాణీకులకు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం
జరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం
జరిగిందని అందరం ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలపాలన్నారు. ఒకే రోజు తొమ్మిది
వందే భారత్ రైళ్ళను ప్రారంభించడం జరగడం చాలా సంతోషమన్నారు. అనంతరం వందే భారత్
రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను కూడా మంత్రి స్వయంగా పలకరించి రైలు
ప్రయాణం పై ఆరా తీసారు.
ఆయుష్మాన్ భవ కార్డులు పంపిణీ : సామాన్యునికి ఆరోగ్య భరోసా ఆయుష్మాన్ భవ
పధకమైన కార్డులను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్
పవార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్భవ పథకం ద్వారా దేశంలోని ప్రతి సామాన్యునికి
వైద్య, ఆరోగ్యానికి సంబంధించి భరోసా కల్పిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భవ సేవా పక్షోత్సవాల్లో భాగంగా స్వచ్ఛంద
రక్తదాన శిబిరాన్ని కాకరపర్తి భావనారాయణ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన డా. భారతీ ప్రవీణ్ పవార్ రక్తదాన
శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి విస్తృతమైన ఆరోగ్య భరోసా కల్పించే పథకం
ఆయుష్మాన్భవ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని ప్రతి
ఒక్కరికి వైద్యానికి భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశ
పెట్టారన్నారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వైద్య సేవలను అందించటం
జరుగుతుందన్నారు. వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమాలకు సంబంధించి కేంద్ర,
కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో వివిధ వైద్య శిబిరాలను నిర్వహించటంతో పాటుగా, టీబీ
వంటి వ్యాధుల నిర్ధారణ, నివారణకు ∙విస్తృత సేవలకు పలు కార్యక్రమాలు
అమలవుతున్నాయని వివరించారు. రాష్ట్రంలోనూ ఆయుష్మాన్భవ కార్యక్రమం ద్వారా
ప్రజలకు గుర్తింపు కార్డులను మంజూరుకు వివిధ మేళాలను నిర్వహిస్తున్నామన్నారు.
అలాగే ఆయుష్మాన్ వైద్య సేవలకు సంబంధించిన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు
వివరించారు.
రక్తదానం, అవయువదానాలు చాలా అవశ్యకతతో కూడుకున్నవన్నారు. రక్తం అందక చాలా మంది
మృత్యువాత పడుతున్నారన్నారు. అలాగే అవయువదానంపై సైతం ప్రజలు చైనత్యవంతం
కావాలన్నారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం చాలా కార్యక్రమాలను
నిర్వహిస్తుందన్నారు. రక్తదానం, అవయువదానాలకు సంబంధించిన యాప్లను
నిర్వహిస్తున్నామని, వాటి ద్వారా ప్రజలు ముందుకు రావాలని ఆహ్వానించారు. మూల
పాడు గ్రామంలో నాభూమి నాదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం బిజెపి
జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గోని
ప్రసంగించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం,
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బిజెపి మాజీ
ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి
నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెవైఎం రాష్ట్ర
అధ్యక్షుడు మిట్టా వంశీ, ప్రవాస్ యోజన రాష్ట్రకన్వీనర్ పాకా వెంకట సత్యనారాయణ,
జిల్లా ఇంఛార్జి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.