గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేసే
అర్హత పోసాని కృష్ణ మురళి కి లేదని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని
ఏపీ రాష్ట్ర బీజేపీ అధికారప్రతినిధి వల్లూరి జయ ప్రకాష్ నారాయణ అన్నారు.
గుంటూరు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎటువంటి అవినీతి మరక లేని బీజేపీ
అధ్యక్షురాలిపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. రాష్టం
లోనిగ్రామ పంచాయితీల సర్పంచ్ల నిధులు దారి మళ్లింపు , రాష్ట్ర ప్రభుత్వం చేసిన
అప్పులు, మద్యం కుంభకోణాలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేక
వ్యక్తి గత దూషణలు చేస్తున్నారన్నారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని, అరాచకం
పెరిగి అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈ ప్రభుత్వం దాడి
చేస్తుందని, అసమర్థ నాయకత్వంలో వైసిపి ఉందన్నారు. రాష్ట్రంలో ఏరులై
పారుతున్న మద్యం అమ్మకాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు
ముట్టాయా, లేదోనని ఆయన రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చింది మీ సిఎం కాదా అని ఆయన ప్రశ్నించారు.
మద్యం అక్రమాలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్
అన్ని అక్రమాలు వెలికి తీస్తామని, ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంటుందో
ప్రజలకు వివరిస్తామని తెలిపారు.