శేషగిరిరావు పిలుపు
గుంటూరు : సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులు, సామాజిక బాధ్యతను
తలకెత్తుకున్న రచయితలు రాసే పుస్తకాలను గ్రంథాలయాల్లో వుంచితే అవి చదువుకున్న
పాఠకులు కూడా గొప్ప వ్యక్తులుగా రూపొందుతారు కాబట్టి కవులు, రచయితలు మంచి
పుస్తకాలను లైబ్రరీలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్
ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు పిలుపు నిచ్చారు. ఆదివారం గుంటూరు బ్రాడీపేట
సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో నవ్యాంధ్ర రచయితల సంఘం
గుంటూరుజిల్లా శాఖ- బాపు రమణ బాలు కళాపీఠం నిర్వహించిన కవిమిత్రుల సంగమం – కవి
సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కవులు,
రచయితల్నే కాదు విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా గ్రంథాలయానికి
రప్పించేందుకు గ్రంథాలయ వ్యవస్థలో కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు
పోతున్నామన్నారు. ఇలాంటి కళాతృష్ణ సమాజ అభ్యదయానికి బాధ్యతాయుతమైన,
సున్నితమైన, అంశాలను సామాజిక కోణంలో స్పురించే అవకాశం కవులకి,కళాకారులకి
మాత్రమే ఉంటుంది. మీ కోణంలో సామాజ అభ్యుదయానికి కూడా మీ వంతు కృషి, రచనల
ద్వారానే కాకుండా మరికొంత క్రియశీలకంగా కూడా సామాజక బాధ్యతను నిర్వర్తించాలని
కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాల్లో మీతో పాటు పాల్గొనే అవకాశం కల్పించిన
పెద్దలందరికీ అలాగే గౌరవప్రదమైన ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గా
అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోట
లీలాకృష్ణ రచించిన ‘బ్రతుకు బాణీలు’ నానీల పుస్తకాన్ని ఓయస్ డి టు చీఫ్ విప్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సుప్రసిద్ధ రచయిత డా.ఎం.ప్రభాకర్ ఆవిష్కరించారు. ఆయన
మాట్లాడుతూ- ఆధునిక సాహిత్యంలో గొప్ప ప్రక్రియగా పేరొందిన ‘నానీ’లవెంట
పడుతున్న ‘గోపీ’లోలుర లిస్టులో లీలాకృష్ణ చేరిపోయారన్నారు.
సభకు అధ్యక్షత వహించిన బాపు రమణ బాలు కళాపీఠం వ్యవస్థాపకులు డా.రమణ యశస్వి
మాట్లాడుతూ- తొలి పుస్తకంగా నానీలను ప్రచురించిన లీలాకృష్ణను అభినందించారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ-కొత్త కవుల్ని
ప్రోత్సహించి, సమాజంలో వారికొక ఉన్నత స్థానాన్ని కల్పించాలనే గొప్ప లక్ష్యంతో
ప్రతీ నెలా కవిమిత్రుల సంగమం-కవిసమ్మేళనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు
చెప్పారు. ‘బ్రతుకు బాణీలు’ నానీల పుస్తకాన్ని కవి,రచయిత లయన్ కాకరపర్తి
సుబ్రహ్మణ్యం సమీక్షించారు. అనంతరం సయ్యద్ జానీబాషా నిర్వహించిన కవి
సమ్మేళనంలో ఆళ్ళ నాగేశ్వరరావు, కారంచేటి విజయ్ కుమార్, విష్ణుమొలకల
భీమేశ్వరప్రసాద్, డా. బలరామ్ పెరుగుపల్లి, పింగళి భాగ్యలక్ష్మి, చల్లా
సత్యవతి, సౌపాటి ప్రభాకర్, గడల శివప్రసాద్, వెదుళ్ళపల్లి సాంబశివరావు,
మెరుమూరి శేషాచారి, నెమ్మాని సీతారామ మూర్తి, మండే సుబ్రహ్మణ్యం, షేక్ రహీం
సాహెబ్, ఆక్సి పాల్గొని తమ కవితల్ని వినిపించారు. కనగాల జయకుమార్ రాసిన కవితకు
ఉత్తమ బహుమతి ప్రకటించి, నగదు బహుమతితో నిర్వాహకులు సత్కరించారు.