జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్
చైర్మన్ మల్లాది విష్ణు కితాబు
ఏలూరు : అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు
వస్తాయనడానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఒక మంచి ఉదాహరణ అని రాష్ట్ర
ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు కితాబు ఇచ్చారు. విజయవాడ లో
వారితో తాము కలిసి పనిచేసిన కాలంలో చూశమన్నరు.విజయవాడ నగరంలో కమీషనరుగా
పనిచేసిన ప్రసన్న వెంకటేష్ నగరంలో పారిశుధ్యం, నీటిసరఫరా, రహదారుల నిర్మాణం,
మరి ముఖ్యంగా ఉధ్యాన పార్కుల ఏర్పాటు, బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగు
వరకు రోడ్డుమద్య డివైడర్ పై ఉధ్యాన వనాలు ఏర్పాటు, ఇందిరాగాంధీ మున్సిపల్
స్టేడియం ప్రక్కన ఫుడ్ పార్క్ ఏర్పాటు, పనులు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. ఆయన
కమీషనరుగా పనిచేసిన కాలంలో విజయవాడ నగరాన్ని సుందరికరణంగా తీర్చిదిద్దడంతో
విజయవాడ నగరానికి పలు అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఏలూరు జిల్లాకు మంచి
కలెక్టర్ ఉన్నారని అదే విధంగా జిల్లాలో సానుకూల ధృక్పదంతో పనిచేసే జిల్లా
యంత్రాంగం ఉందని ఈ దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ఆశించిన మేరకు జిల్లా అభివృద్ధికి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. ఆదిశగా
ఏలూరు జిల్లా ప్రగతి సాధిస్తుందని తాను ఆశిస్తున్నట్లు మల్లాది విష్ణు
తెలిపారు.