విజయవాడ : రాష్ట్రంలో అందరి బాలల్లాగే ఎటువంటి వివక్షకు గురికాకుండా
అందరిలానే ఉన్నత విద్యని పొందుతూ సమాజానికి దిక్సూచిలా సెక్స్ వర్కర్స్
పిల్లలు రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ స్టేట్
ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు హామీ ఇచ్చారు,
శనివారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలస్ లో హెల్ప్ సంస్థ మరియు రాష్ట్ర బాలల
హక్కుల కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నందు సెక్స్
వర్కర్స్ తో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు , బాధిత మహిళలు సుమారు 50 మంది
సభ్యులు పాల్గొన్నారు. సెక్స్ వృత్తిలో బాధితుల పిల్లలు సెక్స్ వృత్తిలోకి
వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులను
సమీక్షించేందుకు హెల్ప్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో రెండవ తరం
పిల్లలపై సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు, ఈ నివేదిక వచ్చిన తర్వాత
రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సెక్స్ వర్కర్ల పిల్లలకి ప్రభుత్వ పథకాలు అన్ని
అందేలా చూస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో లక్ష 30 వేల మంది వ్యభిచారంలో
మగ్గుతున్నారని ఇందులో ఎక్కువ శాతం బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువగా
ఉన్నారని అంటూ బాల్యవివాహాలు, గృహ హింస, వివక్షత రకరకాల సమస్యల నుంచి వచ్చిన
మహిళలే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ తరం వారిని సెక్స్
వృత్తి లోకి రాకుండా అక్రమ రవాణాకి గురి కాకుండా రక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేశలి అప్పారావు తో పాటు
సభ్యులు ఆదిలక్ష్మి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్
ఇన్చార్జి సరస్వతి అయ్యర్, హెల్ప్ సంస్థ కార్యదర్శి రామ్మోహన్ నిమ్మరాజు,
విముక్తి అధ్యక్షులు అపూర్వ, బాలల హక్కుల కమిషన్ పూర్వ సభ్యులు వి. కృష్ణ
కుమార్ పాల్గొన్నారు.