శ్రీకాకుళం : మీకు మంచి జరిగింది అనిపిస్తే ప్రభుత్వాన్ని మరోసారి
ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరుతున్నారని వైయస్సార్సీపీ
జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా
జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచవృత్తులకు సంబంధించిన కుల పెద్దలతో కలసి విశ్వకర్మ
చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మల
కోసం ప్రత్యేకంగా బీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్
రెడ్డికే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలోని 26 లక్షల మంది పంచవృత్తుల
వారున్నారని వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ, సహకారాలు
అందుతున్నాయని, మంచి జరిగితేనే ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చెప్పారని
పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రూ.కోటి ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా
విశ్వకర్మల కోసం సామాజిక భవన నిర్మాణం తమ హయాంలోనే జరిగినట్లు వెల్లడించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలకాలని కోరారు. రాష్ట్ర
వ్యాప్తంగా పండుగ వాతావరణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు
ప్రభుత్వం ముందుకు రావడం సీఎం జగన్ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు నిత్యం
జీవనోపాధిని కల్పించి, పంచవృత్తుల వారు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం
సాధించాలని విశ్వకర్మ దేవుడిని ప్రార్ధిస్తారని, అలాంటి వారికి విశ్వకర్మ
పుట్టినరోజు ఎంతో ముఖ్యమైనదని కృష్ణదాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో
కళింగకోమటి కార్పోరేషన్ ఛైర్మన్ అందవరపు సూరిబాబు, పార్టీ జిల్లా
కార్యదర్శి శిమ్మ రాజశేఖర్, యువజన విభాగం అధ్యక్షులు ఎం.వి.స్వరూప్,
ఉపాధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎన్ని ధనుంజయరావు, వెలమ కార్పోరేషన్ డైరెక్టర్
గంగు శారద, సుగుణారెడ్డి, గౌతమి, డిఎస్కె.ప్రసాద్, రత్నాల నర్శింహమూర్తి,
కోటశ్వరరావు చౌదరి, ఎం.ఎ.బేగ్, విశ్వబ్రాహ్మణ జిల్లా గౌరవాధ్యక్షులు
సింహాద్రి ధనుంజయ, పట్ణణ గౌరవాధ్యక్షులు సతివిల్లి శ్రీనివాసరావు, పట్టణ
అధ్యక్షులు పట్నాన శంకరరావు, విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఎ.శ్రీధర్,
ఎం.హరనాధరావు, కె.మోహనరావు, ఎ.కోటిబాబు, నల్లబాటి కృష్ణమూర్తి, ఎ.గోవిందరావు,
టి.మధుసూదనరావు, కె.నీలకంఠం, జి.ఈశ్వరరావు, వి.మోహనరావు, వి.వెంకటరమణ,
ఎం.నాగరాజు, ఎం.రామసంతోష్, ఎం.రవీంద్రనాథ్, బి.రామకృష్ణ,
ఎస్.శ్రీనివాసరావు, పి.రమణ, ఎ.గణా తదితరులు పాల్గొన్నారు.