చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారం
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ : జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు
దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం
సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్లో వేడుకలు నిర్వహించారు. ఈ
సందర్భంగా పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం
మీడియాతో ఆమె మాట్లాడారు. పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన
వ్యాఖ్యలను మేం తప్పుగా చూడట్లేదు. బీజేపీ అధిష్ఠానానికి అన్నీ వివరిస్తానని
పవన్ చెప్పారు. కేంద్ర పెద్దలతో చర్చించాక మా అభిప్రాయాలు చెబుతాం. చంద్రబాబు
అరెస్టు విధానాన్ని తొలుత బీజేపీనే తప్పుపట్టింది. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు
ఈ అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య
ప్రచారం. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుందని పురందేశ్వరి అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంటర్
జైల్లో కలిసిన తర్వాత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ
అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె
మీడియాతో మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదని, బీజేపీ
అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని, జనసేన పార్టీ బీజేపీతో
పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర
పరిస్థితులు పవన్ తీసుకువెళతామన్నారని, దీనిపై కేంద్రం పెద్దలు మాతో చర్చలు
చేసిన సమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్టు
చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పు పట్టిందని, అరెస్టును ఖండిస్తున్నామని
మేమే ముందుగా ప్రకటన చేశామని పురంధేశ్వరి అన్నారు. సిఐడీ జగన్ ప్రభుత్వం
ఆధ్వర్యంలో పని చేస్తోందని ఆరోపించారు.