పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సెప్టెంబర్ 19న లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 77 చెరువులకు నీరు నింపనున్న సీఎం
లక్కసాగరం పంప్ హౌస్ స్టేషన్, హెలిప్యాడ్ , లిఫ్ట్ పాయింట్, డోన్ బహిరంగ సభ
ఏర్పాట్ల పరిశీలన
కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 19వ తేదీన ఉమ్మడి
కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ ఏర్పాట్లను పరిశీలించారు. హంద్రినీవా కాలువ నుంచి ఎత్తిపోతల
ప్రాజెక్టు ద్వారా 77 చెరువులకు నీటిని నింపే కార్యక్రమాన్ని
ప్రారంభించనున్నట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. అందులో భాగంగా తొలుత కర్నూలు
జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఎస్పీ
కృష్ణకాంత్ లతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్
వద్ధ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ హెలిప్యాడ్ వద్ధ లెవెలింగ్ పనులు
త్వరితగతిన పూర్తి చేయాలని, అదే విధంగా హెలిప్యాడ్ నుండి వేదిక స్థలం వరకు
రెండు ప్రక్కల బ్యారికేడింగ్ చేయించాలని ఆర్ అండ్ బి ఎస్ఈ ని
అదేశించారు.హెలిప్యాడ్ నుండి వేదిక స్థలం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు కి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి సూచించారు.
హెలిప్యాడ్, వేదిక స్థలం వద్ధ ఏర్పాటు చేయాల్సిన టెంట్స్, మొబైల్ టాయ్లెట్స్
, అదే విధంగా త్రాగునీటి సరఫరా కి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత
అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుండి వేదిక ప్రాంతానికి వచ్చే మార్గంలో
రోడ్ లెవెలింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ ఎస్ఈ ని
అదేశించారు. అదే విధంగా రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని,
రోడ్డు వెడల్పు కూడా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను
ఆదేశించారు. పైలాన్ ప్రారంభించే ప్రదేశములో రోడ్డు మార్గం లెవెలింగ్
చేయించాలని, చుట్టూ డబుల్ బ్యారికేడింగ్ వేయించాలని, ప్రజలకు ఎండ తగలకుండా
షామియానా వేయించాలన్నారు.. పంప్ హౌజ్ భవనాన్ని పరిశీలిస్తూ పవర్ సప్లైస్,
మోటర్ కెపాసిటీ, డిస్చార్జ్ కెపాసిటీ యొక్క వివరాలను ఇరిగేషన్ అధికారులను
అడిగి తెలుసుకున్నారు. అధికారులందరూ వారికి కేటాయించిన విధులను సక్రమంగా
నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ
కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు,
పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, డిపిఓ
నాగరాజు నాయుడు, ఇంఛార్జి ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
డోన్ లో బహిరంగ సభ నేపథ్యంలో వేదిక ఏర్పాట్ల పరిశీలన : 77 చెరువులకు నీళ్లు
నింపే కార్యక్రమం అనంతరం డోన్ పట్టణంలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న బహిరంగ
సభ వేదిక ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు.
సభకు భారీగా జనం తరలిరానున్న నేపథ్యంలో అందుకు అనుగణంగా ఏ లోటు పాట్లు లేకుండా
ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి డోన్ లో సభ
ప్రాంగణానికి రావడానికి దిగే హెలిప్యాడ్ ఇప్పటికే కొలిక్కి రావడం పట్ల పనులు
జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలం, ఎల్ ఈ డీ
స్క్రీన్లు, జనం రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, వర్షం పడినా ఏ ఆటంకం లేకుండా
పకడ్బంధీ చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, నంద్యాల జిల్లా జాయింట్
కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డోన్ ఆర్డీవో వెంకటరెడ్డి,డీఎస్పీ
శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు