జగనన్న భూహక్కు-భూరక్ష సమగ్రసర్వేకు సర్వేరాళ్ళు సిద్దం * తొలిదశలో 25.80
లక్షల సర్వేరాళ్ళు సరఫరా * రెండోదశలో 26.15 లక్షల సర్వేరాళ్ళు సరఫరా *
మూడోదశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వేరాళ్ళను అందించాలన్నది లక్ష్యం
* నేరుగా గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లకే ఆర్డర్లు * ట్రేడర్ల ద్వారా
సర్వేరాళ్ళను కొనుగోలు చేయకూడదు * ఇతర రాష్ట్రాల నుంచి శాండ్ స్టోన్ సరఫరా
నిలిపివేస్తున్నాం * గ్రానైట్ ఫ్యాక్టరీలకు విద్యుత్ రాయితీలు అందిస్తున్నాం *
గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఆర్డర్ల ప్రక్రియపై విజిలెన్స్ పర్యవేక్షణ * సచివాలయంలో
సర్వేస్టోన్స పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
అమరావతి : రాష్ట్రంలోని 305 గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న
భూహక్కు-భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వేరాళ్ళ ఆర్డర్లను ఇస్తున్నామని
రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి ప్రకటించారు. అమరావతి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ
నిర్వహకులతో సర్వేరాళ్ళ సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా
మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో గ్రానైట్
ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం శ వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారు.
సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూత ఇస్తూ స్లాబ్ సిస్టమ్ ను
తీసుకురావడం, విద్యుత్ రాయితీలను కల్పించడం చేశాం. అంతేకాకుండా అత్యంత
ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న భూహక్కు-భూరక్ష పథకం కోసం అవసరమైన
సర్వేరాళ్ళను కూడా గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచే కొనుగోలు చేస్తున్నాం. తద్వారా
నిరంతరం గ్రానైట్ ఫ్యాక్టరీలకు పని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
సర్వేరాళ్ళ తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా
కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దానిపై ఆధారపడిన వారికి ఉపాధి
కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సమగ్ర సర్వే కోసం
తీసుకువస్తున్న శాండ్ స్టోన్స్ ను కూడా నిలిపివేస్తున్నాం. దీనితో పాటు బయటి
నుంచి ట్రేడర్ల ద్వారా సర్వేరాళ్ళ కొనుగోళ్ళను కూడా నిలిపివేస్తున్నాం.
మొదటిఫేజ్ లో 25.80 లక్షల సర్వేరాళ్ళను మే 23వ తేదీలోగా అందించడం జరిగింది.
రెండో విడతగా 26.15 లక్షల సర్వేరాళ్ళను జూలై నెల వరకు సరఫరా చేశారు. మూడోదశలో
భాగంగా ప్రస్తుతం రెండువేల గ్రామాలకు గానూ మరో 25.42 లక్షల సర్వేరాళ్ళను
అందించాల్సి ఉంది. దీనిలో తొలిదశలో 653 గ్రామాలకు గానూ 7.3 లక్షల సర్వేరాళ్ళు,
తుదిదశలో 1347 గ్రామాలకు గానూ 17.42 లక్షల సర్వేరాళ్ళను అందించాల్సి ఉంది.
అక్టోబర్ 15వ తేదీ నాటికి మూడోదశ సర్వేరాళ్ళను పూర్తి స్థాయిలో సరఫరా
చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వేరాళ్ళను సరఫరా చేశారు.
ఇందుకు గానూ 1153.2 కోట్ల రూపాయలను సరఫరాదారులకు చెల్లించాం. అలాగే రాళ్ళ
రవాణా కోసం రూ.63.8 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. అలాగే 7.22 లక్షల
శాండ్ స్టోన్స్ ల కొనుగోలుకు రూ.35.7 కోట్లను చెల్లించడం జరిగింది. జగనన్న
భూహక్కు-భూరక్ష కార్యక్రమం కోసం గతంలో గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్ల
నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వేస్టోన్స్ కావాలని కోరడం
జరిగింది. యూనిట్లకు రా మెటీరియల్ ను కూడా గనులశాఖ అధికారులు జిల్లాల్లో
సమకూర్చడం జరిగింది. మొదట రూ.270 ఉన్న రేటును రూ.300 కి పెంచడం జరిగింది. ఈ
రేటుకు సరఫరా చేసేందుకు చాలా ముంది ముందుకు వచ్చారు. ట్రాన్స్ పోర్ట్ కూడా
చేసేందుకు ఆసక్తి చూపిన గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులకు కూడా అవకాశం
కల్పించాం. ఇంత చేస్తున్నప్పటికీ ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు
సర్వేస్టోన్స్ సరఫరా చేస్తున్నారు. తక్కువ రేటుకు ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు
చేసి ఎపిఎండిసికి సరఫరా చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనివల్ల
ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోంది. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించడం
జరగదు. రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సిద్దంగా ఉన్న సర్వేస్టోన్స్ కు
సంబంధించి గనులశాఖకు చెందిన ఎడిలు, డిడిలు పరిశీలించి రికార్డు చేస్తారు. వాటి
ఆధారంగా అన్ని ఫ్యాక్టరీలకు సమానంగా స్టోన్స్ కు ఆర్డర్లు ఇస్తాం. దీనిలో
ఎటువంటి అక్రమాలకు జరగకుండా విజిలెన్స్ అధికారులకు కూడా అధికారాలు ఇస్తున్నాం.
వారు కూడా బాధ్యత తీసుకుని పర్యవేక్షిస్తారు. ఎడి, డిడి స్థాయి అధికారులు
ఇష్టారాజ్యంగా సర్వేస్టోన్స్ సర్టిఫికేషన్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వ నిర్ణయంపై గ్రానైట్ ఫ్యాక్టరీల హర్షం : గ్రానైట్ ఫ్యాక్టరీలను
ఆదుకునేందుకు ప్రభుత్వం చూపుతున్న శ్రద్ద పట్ల పలువురు ఫ్యాక్టరీ నిర్వాహకులు
కృతజ్ఞతలు తెలిపారు. ట్రేడర్లకు సంబంధం లేకుండా నేరుగా ఫ్యాక్టరీల నుంచే
స్టోన్స్ కొనుగోలు చేయాలన్న మంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి
ఫ్యాక్టరీకి ఆర్డర్లు న్యాయంగా అందించేందుకు వీలుగా విజిలెన్స్ అధికారుల
పర్యవేక్షణలో గనులశాఖ అధికారులు పనిచేయాలన్న నిర్ణయం వల్ల అక్రమాలకు చోటు
ఉండదని, ఫ్యాక్టరీలకు మంచిరోజులు వస్తాయని పలువురు గ్రానైట్ పరిశ్రమల
నిర్వాహకులు మంత్రికి తమ సంతోషంను తెలియచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
అమలు చేస్తున్న ఈ పథకానికి అవసరమైన సర్వేరాళ్ళను సకాలంలో అందచేస్తామని, తమపై
నమ్మకం ఉంచి, మార్కెటింగ్ కల్పించింనందుకు సీఎం వైయస్ జగన్ కు, మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ సమావేశంలో స్పెషల్
చీఫ్ సెక్రటరీ (మైన్స్) గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి విజి వెంకటరెడ్డి, పలు
గ్రానైట్ ఫాక్టరీ యజమానులు పాల్గొన్నారు.